రైల్వేలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం

2 Jun, 2019 16:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు నొక్కేసిన విషయం బయటపడింది. సుమారు రూ.2.2 కోట్లు స్వాహా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.  రైల్వే శాఖలో గతేడాది అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం విషయంలో రైల్వే అకౌంట్‌ అసిస్టెంట్స్‌ వి. గణేశ్‌ కుమార్‌, సాయిబాలాజీపై కేసులు నమోదు చేశారు. అలాగే వినాయక ఏజెన్సీస్‌, తిరుమల ఎంటర్‌ ప్రైజెస్‌పై కూడా కేసు నమోదు చేశారు. రైల్వే విజిలెన్స్‌ విభాగం ఫిర్యాదుతో సీబీఐ ఈ కేసులు నమోదు చేసింది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లుల స్కాం

మరిన్ని వార్తలు