ప్రాణం తీసిన పంచాయతీ పోరు

9 Jan, 2019 10:04 IST|Sakshi
అజ్మీరా రవి మృతదేహం

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన తొలిరోజే యాదాద్రి భువనగిరి జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. వార్డుమెంబర్ల పోటీ విషయంలో దాయాదుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో తుర్కపల్లి మండలం ధర్మారం పంచాయతీ పరిధి     పెద్దతండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 

తుర్కపల్లి (ఆలేరు) : మండల పరిధిలోని ధర్మా రం పంచాయతీ పరిధి పెద్దతండాకు చెందిన బిక్షా, చాల్యా దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో చిన్నకుమారుడైన అజ్మీరా రవినాయక్‌ (28) తనకున్న ఎకరంన్నర భూమిలో వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవా డు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఇటీవల ఆరుగుంటల భూమిని విక్రయించుకున్నాడు. వా తావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వ్యవసాయం మానేసి ఊరూరా తిరుగుతూ అ ల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ విక్రయించుకుంటూ జీవ నం గడుపుతున్నాడు.

తన సోదరుడి కుమారుడిని పోటీకి  నిలబెట్టాలని..
పంచాయతీ పరిధి పెద్దతండాలో 7,8 వార్డులు ఉన్నాయి. అయితే 8వ వార్డు నుంచి సోదరుడి కుమారుడైన శ్రీకాంత్‌ను రంగంలోకి దించాలని రవినాయ క్‌ నిర్ణయించుకున్నా డు. అందుకు గ్రామ ఓటర్లతో  సంప్రదింపులు జరుపుతున్నాడు.
 
రాజకీయ కక్షలు భగ్గుమని..
దాయాదుల కుటుంబాల కన్ను ఒకే వార్డుపై పడడంతో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి లక్ష్మణ్‌ నా యక్, అతడి భార్య రాములమ్మ, కూతురు పావ ని,  శ్రీనివాస్‌ నాయ క్, అతడి భార్య శా రద, నరేశ్‌లు కలిసి రవినాయక్‌ ఇంటికి వెళ్లి గొడవకు దిగా రు. పూటకు గతిలేకున్నా ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటూ సూటిపోటి మాటలు అనడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో రవి నాయక్‌ తన పక్కన ఉన్న కర్రతో నరేశ్‌ తలపై కొట్టడంతో కిందపడిపోయాడు. కాసేపటికి నరేశ్‌ లేచి తన ఎదురుగా ఉన్న రవినాయక్‌ మర్మాంగంపై గట్టిగా తన్నడంతో కుప్పకూలిపోయాడు.

పరిస్థితి విషమించడంతో..
ఘర్షణ వాతావరణం సద్దుమణిగాక రవినాయక్‌ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని మాధాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయినా అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో రస్తాపూర్‌ వద్ద 108 వాహన సిబ్బంది ఎదురై రవిని పరిశీలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని ధ్రువీకరించడంతో కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య సబిత, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
పోలీస్‌ పహారాలో ధర్మారం పెద్దతండా
పంచాయతీ పోరులో ఒకరి ప్రాణం బలైపోయింద న్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ధర్మారం పెద్దతండాకు చేరుకున్న ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ వెంకటయ్య ఆధ్వర్యంలో పోలీస్‌ పహారా ఏర్పాటు చేశారు. తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఏసీపీ సిబ్బందిని ఆదేశించారు. పోస్టుమార్టం నిమిత్తం రవినాయక్‌ మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సబిత ఫి ర్యాదు మేరకు ఆజ్మీరాలక్ష్మణ్, రాములమ్మ, శ్రీని వాస్‌నా యక్, నరేశ్‌నాయక్, పావని, శారదలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అదేవార్డుపై దాయాదుల కన్ను
ఇదే వార్డుపై రవినా యక్‌ దాయాదులైన అజ్మీరా లక్ష్మణ్, రాములమ్మ దంపతుల కుమారులు శ్రీనివాస్‌నాయక్, నరేశ్‌ల కన్ను పడింది. దీంతో నరేశ్‌ వార్డుసభ్యుడిగా తన సోదరుడి కుమారుడు మాల్‌నాయక్‌తో పోటీ చేయిం చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు