వేకువనే విషాదం

6 Dec, 2018 11:42 IST|Sakshi
వ్యాన్‌లో చిక్కుకుపోయిన మృతదేహాలు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: స్నేహితుని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి ఉత్సాహంగా నందికొండకు బయలుదేరిన యువకులను మార్గం మధ్యలోనే మృత్యువు బలితీసుకుంది. కొందరు విగతజీవులు కాగా, మరికొందరు క్షతగాత్రులయ్యారు. కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులోని కన్నమంగలపాళ్య గేట్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓమ్ని వ్యాన్‌ను వెనుక నుండి వేగంగా వచ్చిన ఇన్నోవాకారు ఢీకొట్టింది. ఓమ్ని వ్యాన్‌లో ఉన్న 9 మంది యువకుల్లో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా కారులో ఉన్న ముగ్గురు స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. మృతులను వెంకటేశ్‌ (28), సతీష్‌ (24), వికాస్‌(23), సుందర్‌ (25)లుగా గుర్తించారు.  

అందరూ చిరుద్యోగులే
ఓమ్నివ్యాన్‌లోని యువకులు బెంగళూరు ఆర్‌టీ నగర్‌లో ఫ్లవర్‌ డెకొరేషన్‌ పని చేసేవారు. అరకొర జీతంలో కాస్త ఇంట్లో ఇస్తూ పొట్టపోసుకునేవారు. వీరిలో ఒకరి పుట్టినరోజు కావడంతో వేడుకలను నందికొండ లో జరుపుకోవాలని బుధవారం తెల్లవారుజామునే బయలుదేరారు. ఎయిర్‌పోర్టు రోడ్డులో కొత్తగా తారు వేసి వైట్‌ ట్యాపింగ్‌ ట్రాక్‌ వేయకపోవడం, మలుపుల్లో రేడియం స్టిక్కర్‌లు వంటివి లేకపోవడం ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ కమిషనర్‌ హరిశేఖరన్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రసాదంలో విషం.. 12 మంది మృతి

కొంపముంచిన టమాటా రైస్‌

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతిథులుగా...

మహా వివాదం!

పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే

త్వరలో తస్సదియ్యా...

ప్రశ్నకు ప్రశ్న

ఆయుష్మాన్‌.. మరో కొత్త కథ