గ్యాంగ్ స్టర్ రవి పూజారి భారత్‌కు వచ్చే అవకాశాలు..

23 Feb, 2020 10:46 IST|Sakshi

న్యూఢిల్లీ : గత 20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పూజారిని త్వరలోనే భారత్‌కు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత ప్రభుత్వం అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అందింది. ఈ మేరకు రా అధికారుల సహాయంతో కర్నాటక పోలీసులు రవి పూజారీని తీసుకువచ్చేందుకు సెనెగల్‌ దేశానికి వెళ్లారు. ఇదే విషయమై కర్నాటక పోలీసులు మాట్లాడుతూ.. ఒక్క బెంగళూరులోనే రవి పుజారిపై 39 కేసులు ఉన్నాయి. వాటిలో 2007లో షబ్నమ్‌ డెవలపర్స్‌ యజమానులు శైలాజా, రవిల హత్య కేసు తో పాటు మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూరు, హుబ్బల్లి-ధార్వాడ్, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు.(చదవండి : మాఫియా డాన్‌ రవి పుజారీ అరెస్ట్‌)

20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్‌ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్‌గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ సంపాదించి తన కుటుంబాన్ని కూడా సెనెగల్‌కు రప్పించి పలుచోట్ల రెస్టారెంట్లు నడుపుతూ జీవనం సాగించాడు. అయితే గతేడాది జనవరి 2019లో బార్బర్‌ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు. కాగా అప్పటినుంచి కనిపించకుండా పోయిన రవి పూజారి భారతదేశానికి అప్పగించేందుకు సెనెగల్‌ సుప్రీంకోర్టు ఒప్పుకోవడంతో పోలీసులు అతని కోసం సెనెగల్‌ వెళ్లారు.(కోట్లు ఇవ్వాలంటూ మంత్రికి డాన్‌ బెదిరింపు కాల్‌!)

కాగా గతంలో ఛోటారాజన్, దావూద్‌ ఇబ్రహీంలతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని హత్యలు,బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. రవి పూజారి తనను బెదిరించాడని సినీ నిర్మాత మహేష్ భట్ అప్పట్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం పెను సంచలనంగా మారింది.ఆ తర్వాత భట్ ను చంపడానికి కుట్ర పన్నిన రవి పూజారి ముఠాలోని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు