ఏకాంతంగా ఉన్న జంటపై దాడి చేసి..

18 Sep, 2019 10:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహిళపై సామూహిక అత్యాచారం

ఆరుగురి అరెస్టు

సాక్షి, చెన్నై : వాళప్పాడి సమీపంలోని మెయ్యమలై అటవీ ప్రాంతంలో సోమవారం ఏకాంతంగా ఉన్న జంటపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ప్రియుడిని తీవ్రంగా గాయపరిచి..అక్కడి నుంచి తరిమికొట్టారు. అనంతరం ప్రియురాలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. వివరాలు... సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోని మన్‌నాయకన్‌ పట్టికి చెందిన 32 ఏళ్ల వివాహిత అదే ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్‌ బిందెల తయారీ కర్మాగారంలో పని చేస్తోంది. అదే కంపెనీలో పని చేస్తున్న దినేష్‌(25) అనే వ్యక్తితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ బైక్‌పై మెయ్యమలై అటవీ ప్రాంతంలో ఏకాంతంగా గడపడానికి వెళ్లారు. వాళ్లు బైకును మార్గం పక్కన వదిలి మరుగైన ప్రాంతానికి వెళ్లారు. 

అదే సమయంలో అటువైపుగా వచ్చిన గుర్తు తెలియని ముఠా.. దినేష్‌ బైకులో ఉన్న రేషన్‌ కార్డును తీసుకుని అతడిని బెదిరించి కొట్టి తరిమి వేశారు. తర్వాత ఆ మహిళపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారు. ఇంతలో గ్రామంలోకి వెళ్లిన దినేష్‌ కొందరు మద్దతుదారులను తీసుకురాగా అప్పటికే ఆరుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ ఘటనపై బాధిత మహిళ ఏత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ వివేకానందన్‌ ఇడయంపట్టికి చెందిన అళగేశన్‌ (29), సేతుపతి (23), మణికంఠన్‌ (27), గాండానూర్‌కు చెందిన గోకుల్‌ (21), వెంకటేశన్‌ (23), కలైయరసన్‌ (25) అనే ఆరుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా