మహిళపై సామూహిక అత్యాచారం?

23 Apr, 2018 12:37 IST|Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: వైద్యం పేరిట నమ్మించి తీసుకొచ్చిన మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళ నుంచి డబ్బుల వసూలుకు ఒత్తిడి తేచ్చి నగ్నంగా ఉన్న ఫొటోలు బయటపెడతామంటూ బెది రించడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచా రం మేరకు.. ఆదిలాబాద్‌ మండలంలోని ఓ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ చర్మవ్యాధితో బాధపడుతోంది. వ్యాధి నయం చేయిస్తామని మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు కారులో ఆదిలాబాద్‌ మండలంలోని ఓ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి తీసుకొచ్చారు. మత్తు నీళ్లు తాగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పే ర్కొంది.

మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతోపాటు స్థానికులైన ఒకరిద్దరు కలిసి మహిళపై సామూహిక అత్యాచారం చేసినట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి రావడానికి రవాణా ఛార్జీ కింద రూ.7వేలు సద రు మహిళ తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చినట్లు సమాచారం. మళ్లీ రూ.25 వేలు అవసరమని ఫోన్‌ ద్వారా డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. తన వద్ద లేవని సదరు మహిళ చెప్పడంతో నగ్నంగా తీసిన ఫొటోలు అందరికీ పంపిస్తామంటూ మెసేజ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధిత మహిళ తనకు తెలిసిన ఓ వ్యక్తికి వివరించడంతో వారు పోలీస్‌స్టేష న్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరాలు అడుగగా.. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు