కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి

26 Jan, 2018 21:37 IST|Sakshi

ఛండీగడ్‌: కరడుగట్టిన పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్‌ విక్కీ గౌండర్‌, అతని సహచరుడు ప్రేమ్‌ లాహోరియాలు పంజాబ్‌-రాజస్థాన్‌ సరిహద్దులో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. గౌండర్‌  నవంబర్‌, 2016 నుంచి పరారీలో ఉన్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పంజాబ్‌లోని నాభా సెంట్రల్‌ జైలు నుంచి గౌండర్‌తో పాటు మరో ఐదుగురు 2016లో తప్పించుకున్నారు.  వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. తప్పించుకున్న కొద్ది నెలల్లోనే మిగతా ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు కానీ గౌండర్‌ మాత్రం పట్టుబడలేదు.

విక్కీ గౌండర్‌ అసలు పేరు హర్జీందర్‌ భుల్లార్‌. విక్కీ గౌండర్‌  పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాధల్‌ స్వస్థలమైన లాంబిలోని సారావాన్‌ బోడ్లా గ్రామవాసి. మరో కరడుగట్టి నేరస్తుడు సుఖా కహ్లావాన్‌ను ఓ కేసు విషయమై పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తుండగా ఆయనపై 2015లో దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా విక్కీగౌండర్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. విక్కీ గౌండర్‌, ఆయన అనుచరులు జైలు నుంచే దందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు