5 May, 2018 16:38 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: గ్యాంగ్‌స్టర్‌ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్‌ ఎస్సై ఎం.శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (జేఎఫ్‌సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు పేర్కొన్న ఐటీ అధికారులు గతేడాది వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు