బంగారం దుకాణంలో పేలిన గ్యాస్‌సిలిండర్‌

3 Mar, 2018 09:22 IST|Sakshi
మంటల్లో కాలిపోతున్న బంగారం దుకాణం

కుప్పకూలిన భవనం, రూ. 20 లక్షల ఆస్తినష్టం

మిర్యాలగూడలో ఘటన

మిర్యాలగూడ అర్బన్‌: బంగారం దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గ్యాస్‌ సిలిండర్‌ పేలిం ది. ఈ ఘటన  పట్టణంలోని పెద్దబజారులో శుక్రవా రం చోటుచేసుకుంది. స్థానికులు, వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్యజువెల్లరి దుకాణంలో నగలను తయారు చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అందులో పనిచేస్తున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సిలిండర్‌ ద్వారా వచ్చిన మంటలు సామగ్రికి అంటుకుని ఒక్కసారిగా భవనాన్ని కమ్మెశాయి.

అనంతరం సిలిండర్‌ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో భవనం కుప్పకూలి పోయింది. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అం దించారు. ఫైర్‌ట్యాంకర్‌ సకాలంలో రాకపోవడంతో భవనం మెత్తం కాలిబూడిదైంది. దీంతో సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సీఐ జి.వెంకటేశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మున్సిపల్‌ అధికారులతో మా ట్లాడారు. స్పందించిన మున్సిపల్‌ అధికారులు రెండు వాటర్‌ట్యాంకర్లను రప్పించారు. స్థానికులు, ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మంటలు విపరీతంగా చెలరేగడంతో పక్క బిల్డింగ్‌కు మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఇంటిని ఖాళీ చేయించారు. కాగా సంధ్యజువెల్లరి దుకానం నిర్వాహకుడు నారాయణసింగ్‌ మా ట్లాడుతూ ఆ దుకాణంలో సుమారు 40తులాల బం గారం ఉందని, సుమారు 20లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. దుకాణం నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాగా, ఘటన స్థలాన్ని తహసీల్దార్‌ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు.

మరిన్ని వార్తలు