మచిలీపట్నంలో యువకుడి సజీవ దహనం

7 Feb, 2019 09:14 IST|Sakshi

గ్యాస్‌ సిలిండర్‌ పేలి దుర్ఘటన 

సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మగ్గాలకాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. మహ్మద్‌ బాజీ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. పెద్ద ఎత్తున లేచిన మంటలకు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. వెంటనే ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని వార్తలు