విశాఖలో విషాదం.. మరో గ్యాస్‌ లీక్‌..

30 Jun, 2020 06:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్‌ విననయ్‌చంద్‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు.

ప్రమాద ఘటనపై కమిటీ..
హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.. నలుగురు అధికారులతో కమిటీని నియమించారు. పరవాడ ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా