బెయిల్‌పై గజల్‌ శ్రీనివాస్‌ విడుదల

24 Jan, 2018 20:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ బుధవారం రాత్రి బెయిల్‌పై విడుదల అయ్యాడు. తన సంస్థలోని ఉద్యోగినిపై లైగింక వేధింపులకు పాల్పడిన కేస్‌లో గత మూడు వారాలుగా శ్రీనివాస్‌ చంచల్‌గూడ జైల్లో వున్న విషయం విదితమే. కోర్టు శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయటంతో జైల్‌ నుంచి విడుదల అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన కేసు విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడేమీ మాట్లాడలేనన్నారు. తాను నిర్దోషిగా బయటికి వస్తానన్నారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో వెంట ఉండి ప్రోత్సహించిన మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పరుగెత్తి కారులో వెళ్లిపోయారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు