సీఎం సభకు వెళ్లిన 108 వాహనాలు.. వైద్యం అందక బాలిక మృతి

26 Jan, 2019 13:06 IST|Sakshi
ఇన్‌సెట్లో.. ఘటనా స్థలంలో రక్తం మరకలు, దుస్తులు 

రాజధాని ప్రాంతంలో ఘటన 

సాక్షి, తాడికొండ: రాజధాని ప్రాంతంలో పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా అనువైన రోడ్లు లేకపోవడం.. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాల్సిన 108 వాహనాలు అందుబాటులో లేకపోవడం కారణంగా ఓ బాలిక మృత్యుఒడికి చేరింది. తాడికొండ మండలం మోతడక గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం వేగంగా వెళుతున్న ఆటోకు టైరు పేలడంతో అదుపుతప్పింది. దీంతో అమరావతి వలస మాలపల్లికి చెందిన రాయపూడి గీతాంజలి (14) తీవ్రగాయాలపాలై కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. అయితే వాహనం అందుబాటులో లేదని, రావడానికి సమయం పడుతుందంటూ సమాధానం రావడంతో కంగుతిన్నారు. చిన్నారిని హుటాహుటిన ప్రైవేటు వాహనంలో గుంటూరులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. కాగా, ముఖ్యమంత్రి సభ పేరిట శుక్రవారం ఉదయం 8 గంటలకే తాడికొండ, అమరావతి మండలాలకు చెందిన 108 వాహనాలను తుళ్ళూరు ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంతంలో 108 సేవలు శుక్రవారం పూర్తిగా నిలిచిపోయాయి. 

మరిన్ని వార్తలు