ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు!

23 Jul, 2020 07:53 IST|Sakshi

సాక్షి, సారంగాపూర్‌(జగిత్యాల): నన్ను క్షమించండి అమ్మా.. నాన్న! నేను ప్రేమించిన రంజిత్‌ పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడు.. నిన్ను పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి లేదంటే నువ్వు చచ్చిపోవాలి అని అంటూ బెదిరిస్తూ మానసికంగా నాకు నరకం చూపుతున్నాడు.. అమ్మా.. నేను వాడిని పెళ్లి చేసుకున్నా నన్ను హ్యాపీగా ఉండనివ్వడు.. నేను వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డపేరు తేవడం నాకు ఇష్టం లేదు.. నేను బతికి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు.. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా... గుడ్‌బై ఆల్‌ మై ఫ్యామిలీ మెంబర్స్‌.. మిస్‌యూ మై ఫ్యావిులీ.. మిస్‌ మై మామ్‌.. డాడ్‌.. అంటూ ఓ  యువతి సూసైడ్‌ నోట్‌ రాసి, గడ్డి మందు తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజులకు మృతిచెందింది. 

సారంగాపూర్‌ ఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. సారంగాపూర్‌ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19) రెండేళ్ల కిందట సారంగాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటరీ్మడియట్‌ పూర్తి చేసింది. ఇంటర్‌లో తన క్లాస్‌మేట్‌ అదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్‌(19)తో పరిచయం ఏర్ప డి, ప్రేమగా మారింది. ఇంటర్‌ పూర్తయ్యేవరకు వారి ప్రేమ వ్యవహారం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఉమ రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ బీడీలు చుడుతోంది. ఈ క్రమంలో కొన్ని కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ఉమ రంజిత్‌ను కోరుతోంది. అతను అంగీకరించకుండా పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి, లేదంటే నువ్వు చచ్చిపోవాలి అంటూ ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు.

ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లి కొత్తపల్లి లక్ష్మి, తండ్రి సత్తయ్యలకు తెలిపింది. ఇద్దరి కులాలు వేరైనా తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని వారు రంజిత్‌ను ప్రాధేయపడ్డారు. కానీ అతను వినలేదు. దీంతో బాధిత కుటుంబీకులు ఉమకు వివాహం చేయాలని పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఎన్ని సంబంధాలు వస్తున్నా రంజిత్‌ వాటిని చెడగొడుతూ ఉమకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాలకు తరలించారు.

పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. కుటుంబీకులు మృతదేహంతో ఇంటికి వచ్చారు. ఇంట్లో మృతురాలి అక్కలకు ఉమ రాసిన సూసైట్‌ నోట్‌ దొరికింది. ఎస్సై రాజన్న మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమి త్తం ఆస్పత్రికి పంపించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫి ర్యాదు మేరకు రంజిత్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు