ప్రేమించాడు..పెళ్లి ముహుర్తం పెట్టాకా..

10 Sep, 2019 08:25 IST|Sakshi
కొమానపల్లిలో బాధితురాలు అమ్మాజీ, తల్లిదండ్రులను విచారిస్తున్న డీఎస్పీ తిలక్‌

సాక్షి, తూర్పుగోదావరి(ముమ్మిడివరం) : ప్రేమించిన ప్రియుడు వివాహ ముహూర్తం పెట్టాక ముఖం చాటేయడంతో ప్రియురాలి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు ఛీటింగ్, అత్యాచారం కేసులు నమోదు చేశారు. కాకినాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ యాక్టు విభాగం డీఎస్పీ ఏబీజే తిలక్, ఎస్సై వెంకటరమణ మండలంలోని కొమానపల్లిలో బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. కొమానపల్లి గ్రామానికి చెందిన వంగలపూడి అమ్మాజీ, ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన అప్పాడి రాజేష్‌ అమలాపురంలో కంప్యూటర్‌ విద్య నేర్చుకొనే సమయంలో ప్రేమించుకున్నారు. ఆ తరువాత అమ్మాజీ ముమ్మిడివరంలో హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న సమయంలో రాజేష్‌ గత జూలై నెలలో పెళ్లి చేసుకుంటానని అమలాపురం సాయిబాబా గుడికి తీసుకు వెళ్లి నుదుట విభూది బొట్టు పెట్టి అక్కడి నుంచి ఓడల రేవు బీచ్‌కు తీసుకువెళ్లాడు.

29న హైదరాబాద్‌ ఆర్య సమాజానికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుని, కొద్ది రోజులు అక్కడ వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. విషయం అమ్మాజీ తల్లిదండ్రులకు తెలియడంతో కొమానపల్లి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఆగస్టు 25న వారికి పెళ్లి చేయడానికి రాజేష్‌ తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే ఫైనాన్స్‌ కంపెనీలో తగవు ఉందని చెప్పి ఆగస్టు 17న స్నేహితులతో కలిసి వెళ్లిన రాజేష్‌ తిరిగి రాలేదని ఈ విషయంపై రాజేష్‌ తండ్రిని నిలదీస్తే వారి పెళ్లికి కులం అడ్డుగా చూపి నిరాకరించాడని అమ్మాజీ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ముమ్మిడివరం ఎస్సై ఎం.పండుదొర ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్వగృహంలో సోమ వారం అమ్మాజీతో పాటు తల్లిదండ్రులు శంకరరావు, సత్యవతిలను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బార్లలోమహిళా డ్యాన్సర్లు, సప్లయర్లు..

టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు

పబ్‌జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలుగా..

ఎందుకిలా చేశావమ్మా?

‘స్వామి లీలలు బట్టబయలైనా అరెస్ట్‌ చేయలేదు’

గోదావరిలోకి దూకి కుటుంబం ఆత్మహత్య?

ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం

దారుణం: పసికందు నోట్లో వడ్లగింజలు వేసి..

ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌

130 కేజీల గంజాయి పట్టివేత

ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్‌

దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడు 

రూసా నిధుల్లో చేతివాటం!

‘నా కొడుకు కోసం ఏం చేయలేకపోతున్నాను’

నిమజ్జనంలో విషాదం

‘ఎలక్ట్రానిక్‌’ మోసం.. 70 శాతం ఆఫర్‌

భర్త మందలించాడని ఆత్మహత్య

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 

ఆగిన అన్నదాతల గుండె 

ఉన్నదంతా ఊడ్చేశారు!

పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు..

హోటల్‌ గది అద్దె చెల్లించాలన్నందుకు..

దారుణం: మాయమాటలు చెప్పి ఇంటికి రమ్మని..

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి 

యువకుడి హత్య

యువకుడి ఆత్మహత్య

సద్దుమణగని సయ్యద్‌పల్లి

అనుమానాస్పద స్థితిలో మాజీ కౌన్సిలర్‌ మృతి

భార్య రహస్య చిత్రాలను షేర్‌ చేసిన భర్త..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

నేనొస్తున్నా