లైంగిక వేధింపులు.. భవనం నుంచి దూకిన బాలిక

6 Apr, 2018 21:50 IST|Sakshi

ముంబై : లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక(12) నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం​ ముంబయిలోని పాల్‌ఘార్‌ జిల్లా ఆల్‌కాపూరి కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటి వద్ద ఉన్న బాలిక దగ్గరకు వచ్చి కాగితం చూపించి చిరునామా అడిగాడు. అంతేకాక ఆ బాలికకు మాయ మాటలు చెప్పి అడ్రస్‌ చూపించమని తన వెంట తీసుకెళ్లాడు.

ఆ వ్యక్తి ఓ భవనంపైకి తీసుకెళ్లి బాలికపై  లైంగిక దాడికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిగటించిన బాలిక అతని నుంచి తప్పించుకోవటానికి భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర గాయాలైనా ఆ బాలికను నగరంలోని నాయర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి  నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా