కరోనా భయం; యువతిపై అమానుషం!

4 Jul, 2020 10:53 IST|Sakshi

నోయిడా: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్ల బస్సు కండక్టర్‌, డ్రైవర్‌ మానవత్వం మరిచి ప్రవర్తించారు. సదరు యువతిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారు ఆమెను బస్సు నుంచి తోయడంతో గుండెపోటుతో మరణించిందని కుటుంబ సభ్యులు మధుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 19 ఏళ్ల అన్షీక తన తల్లితో కలిసి యూపీ రోడ్‌వేస్ బస్సులో నోయిడా నుంచి షికోహాబాద్ వెళ్తుంది. మధుర సమీపంలో అన్షీక ఎండ కారణంగా అలసటగా ఉండటంతో మూర్చపోయింది. దీంతో ఆమెకు కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో కండక్టర్‌, డ్రైవర్‌ మధుర వద్ద బస్సు నుంచి ఆమెను తోసేయయడంతో యువతి మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు మాంట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ భీమ్ సింగ్ తెలిపారు. (గ్రేటర్‌లో కరోనా విజృంభణ.. జనం హైరానా )

పోస్టుమార్టం రిపోర్టులో అన్షీక గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైంది. అన్షీకను బస్సు నుంచి కిందకు తోసే క్రమంలో డ్రైవర్‌, కండక్టతో ‌వాదన జరుగిందని, అప్పుడే అన్షీకకు గుండెపోటు వచ్చి ఉంటుందని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. ఇది సహజ మరణం కిందకు వస్తున్నందున ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని సింగ్‌ పేర్కొన్నారు. ఇక మృతురాలి సోదరుడు మాట్లాడుతూ.. బస్సు ఎక్కేటప్పుడు తన సొదరి బాగానే ఉందని, ఎండకారణంగా అలసిపోయి మూర్చపోయిందని చెప్పాడు. దీంతో బస్సు మొత్తం తను కరోనా వైరస్‌ సోకినట్లుగా ప్రవర్తించడంతో డ్రెవర్‌, కండక్టర్‌ తన సోదరిని వేధించడం ప్రారంభించారని తెలిపాడు. ఆ తర్వాత తనని దుప్పటితో చుట్టి బస్సులోంచి విసిరారని ఆవేదన వ్యక్తం చేశాడు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో మలుపు )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా