లంకె బిందెల పేరుతో లైంగిక దాడి

18 May, 2020 17:23 IST|Sakshi
చెట్టుకు కట్టి ఉన్న రాంబాబు

సాక్షి, దొనకొండ: లంకె బిందెలు తీస్తాం.. మీ జీవితాలు బాగు పరుస్తాం.. భార్యా, భర్తల గొడవలు సరి చేస్తాం.. అంత్రాలు, మంత్రాలు వేస్తాం అంటూ నమ్మించి బాలికపై అత్యాచారం చేసిన దొంగ పూజారి గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..మండలంలోని రుద్రసముద్రం గ్రామానికి చెందిన గోనా రామాంజితో నల్గొండ జిల్లా అడవిదేవిపల్లి మండలం మొగిలిచర్లకు చెందిన విష్ణువర్దన్‌ అలియాస్‌ రాంబాబు పరిచయం ఏర్పరుచుకున్నాడు. రాంబాబు అంత్రాలు, తంత్రాలు వేస్తూ తిరుగుతున్నాడు. రామాంజి రాంబాబుకు సహాయ పడుతున్నాడు.

ఈ క్రమంలో రామాంజి తన అన్న గోనా బాలరాజు ఇంటికి తీసుకు వచ్చారు. బాలరాజు ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తూ, పూజకు అమ్మాయి కావాలి అనడంతో బాలరాజు తన కూతురిని గదిలోకి పంపించారు. దీంతో బాలికపై లైంగికదాడి పాల్పడ్డాడు. బాలిక మార్కాపురం పాఠశాలలో చదువుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి వచ్చింది. పూజల విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో మోటారు సైకిల్‌పై బాలికను ఎక్కించుకుని తన మిత్రుడు రామాంజితో కలిసి పరారయ్యేందుకు రాంబాబు ప్రయత్నించాడు. చదవండి: భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం

గ్రామస్తులు పసిగట్టి రాంబాబును పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. పూజల పేరుతో సుమారు రూ.3 లక్షల నగదును గ్రామస్తుల వద్ద నుంచి అతను తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఎస్సై బి.ఫణిభూషణ్, సీఐ వేలమూరి శ్రీరాం, డీఎస్పీ కె.ప్రకాశరావులు గోనా బాలరాజు ఇంటి వద్దకు వెళ్లి విచారించారు. మార్కాపురం–2 టౌన్‌ ఎస్సై కె.దీపిక నివేదిక ప్రకారం ఎస్సీ, ఎస్టీ, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.   చదవండి: రూ.150 కోసం ఫ్రెండ్‌ను చంపేశాడు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా