మాయమాటలు చెప్పి.. బాలికపై లైంగిక దాడి

17 Dec, 2019 08:38 IST|Sakshi
నిందితుడు ఉప్పాడ సంతోష్‌

అసభ్యకర చిత్రాలు తీసి తండ్రికి వాట్సాప్‌ 

వరుసకు చెల్లి అయ్యే బాలికపైనే దుశ్చర్య  

పరారీలో నిందితుడు సంతోష్‌  

పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు 

సంత బొమ్మాళి: మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన  బాలికపై అదే గ్రామానికి చెందిన వివాహితుడు వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు నౌపడ పోలీసులకు బాలిక తల్లి సోమ వారం ఫిర్యాదు చేసింది. బాలిక స్వగ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతోంది. తండ్రి విదేశాల్లో పనిచేస్తున్నాడు. పిల్లల బాధ్యతను తల్లి చూసుకుంటుంది. గ్రామానికి చెందిన వివాహితుడు ఉప్పాడ సంతోష్‌ ఆ ఇంటికి తరుచూ వెళ్లడం, ఇంటి పేరు ఒకటే కావడంతో వారిలో ఒకడిగా కలిసిపోయాడు. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను అప్పుడప్పుడు తెచ్చి ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి మరింత దగ్గరై వరుసకు చెల్లి అయ్యే 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పాడు. బాలిక స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో అసభ్యకర చిత్రాలను తీశాడు. పసుపు తాడు కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్న ఆ దృశ్యాలను తండ్రి వాట్సాప్‌కు పంపాడు. బాలికకు, తల్లికి వెంటనే తండ్రి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. దీనిపై గ్రామంలో రెండు రోజులుగా పంచాయితీ నడిచింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా  లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత కుంటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్‌ఐ బి.గణేష్‌ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా