సెల్‌ తీసుకున్నాడని ఆత్మహత్య 

22 Apr, 2020 12:06 IST|Sakshi

కొమ్మాది(భీమిలి): సరదాగా సెల్‌ఫోన్‌ గేమ్‌ ఆడుతుండగా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రారంభమైన చిన్న వాగ్వాదం చెల్లెలి ప్రాణం పోవడానికి కారణమైంది. ఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 4వ వార్డు నేరెళ్లవలసకు చెందిన చెల్లుబోయిన ముసలయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు రాంబాబు, కుమార్తె హంసలీల ఉన్నారు. రాంబాబు ఆనందపురంలోని ఒక కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుండగా.. హంసలీల భీమిలి సీబీఎం స్కూల్లో పదో తరగతి చదివేది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరిద్దరూ ఇంటివద్దనే ఉంటున్నారు.

మంగళవారం సాయంత్రం హంసలీల సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుతుండగా తన అన్న రాంబాబు ఫోన్‌ లాక్కున్నాడు. ఈ సమయంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన హంసలీల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడు కాపాడేందుకు ప్రయత్నించగా, అప్పటికే ఆమె మరణించింది. ఆ సమయంలో తల్లిదండ్రులు పనుల నిమిత్తం వేరే చోట ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   

మరిన్ని వార్తలు