ప్రేమ వేధింపులకు బాలిక బలి

9 Apr, 2019 11:00 IST|Sakshi
రోదిస్తున్న సంధ్య కుటుంబసభ్యులు, సంధ్య మృతదేహం 

మంచిర్యాలక్రైం: ప్రేమికుని వేధింపులు భరించలేక ఓ బాలిక (17) తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిని బూర్ల రాజయ్య, స్వరూప దంపతుల కూతురు సంధ్యకు అదే గ్రామానికి చెందిన ఎండీ.అక్బర్‌ కొంతకాలం క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ వెంట పడుతున్నాడు. ఏడాదిన్నర క్రితం సంధ్య సీసీసీ నస్పూర్‌లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికెళ్లింది. ఆ సమయంలో అక్బర్‌ సంధ్యను కిడ్నాప్‌ చేశాడు.

ఈ విషయంలో అక్బర్‌పై సీసీసీ పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలేబుల్‌ కేసు నమోదైంది. అక్బర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్బర్‌ను మరిచిపోవాలని కుటుంబసభ్యులు సంధ్యకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మూడు నెలల జైలుశిక్ష అనంతరం బెయిల్‌పై వచ్చిన అక్బర్‌.. సంధ్యను వివాహం చేసుకుంటానంటూ మళ్లీ వేధించసాగాడు. అతడి వేధింపులు భరించలేని సంధ్య కుటుంబం ఇటీవల మంచిర్యాలలోని సున్నంబట్టివాడకు మకాం మార్చారు.

అయినా అక్బర్‌ నుంచి వేధింపులు ఆగలేదు. ఇటీవల ఇంటికి వెళ్లి సంధ్యను తానే పెళ్లి చేసుకుంటానని, తనను కాదని ఎవరు చేసుకున్నా వారి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబస భ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తు న్నట్లు మంచి ర్యాల ఎస్సై ఓంకార్‌యాదవ్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు