ఆభరణాల పేరుతో మహిళలకు టోకరా

14 May, 2019 13:26 IST|Sakshi
యువకులు అందజేసిన గిల్ట్‌ ఆభరణాలు

కోవూరు: తక్కువ ధరకే పంచలోహాలతో తయారుచేసిన ఆభరణాలు ఇస్తామంటూ ఇద్దరు యువకులు మహిళలను మోసం చేశారు. స్థానిక బ్రహ్మణవీధి తదితర ప్రాంతాల్లో నలుగురు మహిళల దగ్గర నుంచి రూ.11,500 తీసుకుని గిల్ట్‌ ఆభరణాలు అందజేశారు. దీంతో సోమవారం బా«ధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు.. కృష్ణా జిల్లా బ్రాంచ్‌గా ఓ ఏజెన్సీ పంచలోహాలతో తయారుచేసిన ఆభరణాలను సగం ధరకే అందిస్తామంటూ సోమవారం ఇద్దరు యువకులు ఆయా ప్రాంతాల్లోని మహిళలకు చెప్పారు. నెలరోజుల తర్వాత డ్రా తీసి బహుమతి అందజేస్తామంటూ వారిని నమ్మించారు. వస్తువులను మహిళలకు ఇచ్చి రూ.11,500 తీసుకెళ్లారు. తర్వాత అవి గిల్ట్‌ ఆభరణాలను అని మహిళలు తెలుసుకుని మోసపోయామని గ్రహించారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాబీ తెలిపారు.

మరిన్ని వార్తలు