లలితా జ్యువెలరీలో భారీ చోరీ

3 Oct, 2019 04:20 IST|Sakshi

50 కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాలు చోరీ

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని లలితా జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన నగలను దుండగులు చోరీచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుచిరాపల్లి సత్రం బస్‌స్టేషన్‌ దగ్గర లలితా జ్యువెలరీ షోరూం ఉంది. అందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రదర్శన కోసం ఉంచిన నగలు బుధవారం ఉదయానికి మాయమయ్యాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.

షోరూం వెనుక గోడకు కన్నం వేసి ఉంది. దుండగులు తమ వేలిముద్రలు ఫోరెన్సిక్‌ నిపుణులకు దొరక్కుండా ఉండేందుకు కారప్పొడి చల్లి వెళ్లారు. ముఖాలకు జోకర్‌ బొమ్మల మాస్క్‌లు వేసుకుని షోరూంలో సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన వంద కిలోల బంగారం, వజ్రాలు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. రూ.13 కోట్ల విలువైన నగలు చోరీకి గురయ్యాయని తిరుచ్చిలో లలితా జ్యువెలరీ యజమాని కిరణ్‌ చెప్పడం గమనార్హం.

lalitha jewellery Robbery

lalitha jewellery Robbery

lalitha jewellery Robbery

మరిన్ని వార్తలు