నటుడు ప్రశాంత్‌ మొదటి భార్య ఇంట్లో..

29 Mar, 2018 11:26 IST|Sakshi
చోరీ జరిగిన ఇల్లు (ఇన్‌సెట్‌ ) గృహలక్ష్మి

తిరువొత్తియూరు: చెన్నై, టీనగర్‌లో సినీ నటుడు ప్రశాంత్‌ మొదటి భార్య ఇంట్లో 170 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చెన్నై టీ.నగర్‌ సౌత్‌ పార్కు రోడ్డులో సినీ నటుడు ప్రశాంత్‌ మొదటి భార్య గృహలక్ష్మి ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈమె అడయారులో నివాసం ఉంటున్నారు. వారం వారం ఇక్కడికి వచ్చి బస చేసి వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి కిటికీలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా 170 సవర్ల నగలు, రూ.10వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది.దీనిపై ఫిర్యాదు అందుకున్న మాంబలం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

దొంగలకు దేహశుద్ధి: తాంబరం పడప్పై నీలమంగళంకు చెందిన శ్రీనివాసులు ఆడిటర్‌. శ్రీనివాసన్‌ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇతని ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఇది చూసిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో పట్టుబడిన వారు షోలింగనల్లూరుకు చెందిన రమేష్, ఆనంద్‌ అని తెలిసింది.

దొంగను పట్టించిన ఇంజినీర్‌
చెన్నై కన్నగినగర్‌ కారపాక్కం భారతీయార్‌ వీధికి చెందిన అబుదాగిరి (23) ఇంజినీర్‌. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పక్క వీధిలో ఉన్న హోటల్‌కు వెళ్లాడు. తరువాత 1.30 గంటల సమయంలో ఇంటికి రాగా ఆసమయంలో ఇంట్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే బయట తలుపులకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని చోరీకి ప్రయత్నిస్తున్న మణికంఠన్‌ (26), కార్తికేయన్‌ (27)లను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా