రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు

11 Sep, 2019 17:56 IST|Sakshi

బెంగళూర్‌ : ఆన్‌లైన్‌ గేమ్‌లో నష్టాలతో అప్పుల్లో మునగడంతో కంపెనీ నిధుల నుంచి రూ 38 కోట్ల సొమ్మును తన ఖాతాల్లోకి మళ్లించిన గోల్డ్‌మన్‌శాక్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్వని ఝంఝన్‌వాలాను తొలగించామని కంపెనీ బుధవారం వెల్లడించింది. అశ్వని ఝంఝన్‌వాలాను తక్షణమే డిస్మిస్‌ చేశామని, అతనిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టేందుకు పోలీసు అధికారులకు సహకరిస్తామని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఇండియన్‌ సబ్సిడరీ ఫిర్యాదుపై అశ్వనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 420 కేసు నమోదు చేశారు. ఛీటింగ్‌ కేసులో నిందితుడిని స్ధానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించిందని మరథహల్లి సీఐ ఎస్‌పీ గిరీష్‌ తెలిపారు.

కాగా, తన కింది ఉద్యోగులు గౌరవ్‌ మిశ్రా, అభిషేక్‌ యాదవ్‌, సుజిత్‌ అప్పయ్యల సహకారంతో అశ్వని కంపెనీ డబ్బును స్వాహా చేశాడు. శిక్షణ పేరుతో వారి ఆఫీస్‌ సిస్టమ్స్‌లో అశ్వని లాగిన్‌ అయ్యేవాడని, వారిని మంచినీళ్లు తీసుకురమ్మని, ఇతర పనులను అప్పగించి నిధుల దోపిడీకి పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండస్ర్టియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు అక్రమంగా రూ 38 కోట్ల సంస్థ నిధులను బదిలీ చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.

చదవండి : అప్పుల్లో మునిగి పనిచేసే సంస్థకు కన్నం

మరిన్ని వార్తలు