థియేటర్‌కు మూత

14 Jun, 2018 08:34 IST|Sakshi

తిరువొత్తియూరు: కడలూరులో పైరసీ సీడీలు తయారు చేస్తున్న గోమతి సినిమా థియేటర్‌కు పోలీసులు సీలు వేశారు. తమిళనాడులో పైరసీ సీడీల విక్రయం ఎక్కువైంది. రెండు వారాల ముందు విడుదలైన ఒరు కుప్పై కథై చిత్రం ఇంటర్నెట్‌లోను, పైరసీ సీడీలలోను విడుదలైంది. దీంతో చిత్ర నిర్మాత మంగళవారం కడలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందులో విదేశాలకు పేటెంట్‌ హక్కు ఇస్తే దాని ద్వారా దొంగతనంగా సినిమా లీక్‌ అవుతుందన్నారు.

ఈ చిత్రానికి విదేశీ హక్కు జారీ చేయలేదని కాని ఇంటర్నెట్‌లో పైరసీ సీడీల మూలంగా సినిమా బయటకు రావడం దిగ్భ్రాంతిని కలుగచేసిందని పేర్కొన్నారు.  ఆ డీవీడీలను పరిశీలించగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మయిలాడుదురై గోమతి థియేటర్‌లో పైరసీ సీడీలు తయారు అవుతున్నట్టు తెలిసిందన్నారు. దీంతో పోలీసులు బుధవారం గోమతి థియేటర్‌లో తనిఖీ చేయగా పైరసీ సీడీలు తయారుచేస్తున్నట్టు తెలిసింది. దీంతో  సినిమా థియేటర్‌కు సీలు వేసి ఇద్దరిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు