కీచక గురువు.. సన్నిహితంగా ఉండమంటూ..

24 Nov, 2019 14:35 IST|Sakshi

తిరువనంతపురం : గురువును మించిన దైవం లేదంటారు. అలాంటి గురువే.. విద్యార్థులపట్ల కీచకుడిగా మారి అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో సన్నిహితంగా ఉండమంటూ బలవంతం చేశాడు. ఉపాధ్యాయుడి వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు విషయాన్ని ఎలాగోఅలా బయటపెట్టారు. దీంతో కీచక ఉపాధ్యాయుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కేరళలోని నేదుమంగడ్‌ నగరంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబీ సి జోసెఫ్ అనే వ్యక్తి తిరువనంతపురంలోని నేదుమంగడ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు.. విద్యార్థులపై కన్నేశాడు. తనతో సన్నిహితంగా మెలగాలంటూ విద్యార్థులను వేధించాడు. ప్రతి రోజు విద్యార్థినీలను అసభకరంగా తాకుతూ లైంగికంగా వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక పదకొండో తరగతి విద్యార్థికి కంప్లైంట్‌ బాక్స్‌లో లేఖ రాసి వేశారు. బాక్స్‌ తెరచి గ్రామ క్లబ్‌ సభ్యులు, ఉపాధ్యాయ కమిటి అతనిపై విచారణ చేపట్టారు. విచారణలో మరో తొమ్మిది మంది విద్యార్థినీలు కూడా అతనిపై ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత కీచల ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించారు. బాబీ సి జోసెఫ్‌ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని తిరువనంతపురం పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు