మసీదులో కాల్పులు..

13 Oct, 2019 04:39 IST|Sakshi

బుర్కినా ఫాసోలో 16 మంది మృతి

ఓవాగడౌగౌ: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో కాల్పుల కలకలం చెలరేగింది. ఓవాగడౌగౌ నగరంలోని మసీదులో జరిగిన ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆయుధాలు ధరించిన కొందరు ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం మసీదులో ప్రవేశించి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రెంచ్, ఆమెరికన్, కెనడియన్, జర్మన్‌ బలగాలు తమ ప్రాంతంలో ప్రవేశించి ఉగ్రవాదులతో పోరాడుతున్నామని చెబుతున్నాయని, అయితే విదేశీయులు తమ దేశంలో ఉండటం ఇష్టం లేని ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడుతున్నాయని ఓ స్థానికుడు తెలిపారు.

మరిన్ని వార్తలు