విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో మలుపు 

4 Jul, 2020 09:10 IST|Sakshi

ఒక విద్యార్థి నుంచి మరికొంత మందికి వీడియోలు పంపినట్లు గుర్తించిన పోలీసులు

ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

మరో ముగ్గురి కోసం సాగుతున్న వేట  

పట్నంబజారు (గుంటూరు): గుంటూరుకు చెందిన బీటెక్‌ విద్యార్థిని నగ్నచిత్రాలను సోషల్ ‌మీడియాలో అప్‌లోడ్‌ చేసిన కేసులో మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన కౌశిక్‌లను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్‌ చేసిన యువకుడి కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు.. “మై నేమ్‌ ఈజ్‌ 420’ అనే ఇన్‌స్ట్రాగామ్‌ ఐడీపై విద్యార్థిని నగ్న చిత్రాలను అప్‌లోడ్‌ చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. విద్యార్థిని చదివిన కళాశాలలోనే చదివిన విద్యారి్థకి ఈ వీడియోలు, చిత్రాలు అందాయి. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!)

అయితే ఇవి ఎక్కడ నుంచి అతడికి వచ్చాయి అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియోలు సంపాదించిన విద్యార్థి వాటిని ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్‌ చేయటంతో పాటు మరో నలుగురికి పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి చెందిన విద్యార్థితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. వీడియో తీసుకున్న విద్యార్థి సదురు విద్యార్థినిని బెదిరించి నగదు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా