‘కామాంధుడిని శిక్షించే వరకు.. దహనం చేయం’

19 Jun, 2019 13:12 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసిన దారుణ ఘటనపై హన్మకొండ నగర ప్రజలు భగ్గుమన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్‌ పాలజెండాలో శ్రిత హత్యకు నిరసనగా మహిళలు, యువకులు అశోక జంక్షన్‌లో మానవహారం వేసి ఆందోళనకు దిగారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, లేదంటే తమకు  అప్పగించండి అంటూ కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. నిందితుడికి శిక్ష పడే వరకు పాప మృతదేహాన్ని దహనం చేయమంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పుతున్నారు. 

జక్కోజీ జగన్, రచన దంపతుల కుమార్తె శ్రిత(9నెలలు)ను కొలేపాక ప్రవీణ్ (28)అనే వ్యక్తి ఎత్తుకెళ్లి అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారు జామున స్పృహ తప్పిపడిపోయిన పాపను హూటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పాప మృతదేహాని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు కారకుడైన ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు