హనుమాన్‌ ఆలయ అర్చకుడి హత్య

12 Oct, 2017 09:01 IST|Sakshi
మృతుని భార్య వెంకటమ్మనుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఐ ,మృతదేహన్ని పరిశీలిస్తున్న సీఐ

పూజలు చేసి వెళ్తుండగా చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేసిన మృతుడి భార్య

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాపూరావు

మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు.. తరలివచ్చిన ప్రజలు

మంచిర్యాల , తలమడుగు(బోథ్‌): మండలంలోని పో న్నారి గ్రామ హనుమాన్‌ ఆలయ అర్చకుడు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్య కు గురయ్యాడు. ఆలయంలో పూజలు చేసి న అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో మాటువేసిన వ్యక్తులు ఆయనను మట్టుబెట్టారు. ఈ హత్య తాంసి, భీంపూర్‌ మండలాల్లో సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. భీంపూర్‌ మండలం నిపాని గ్రామానికి చెందిన కత్రజి సుదర్శన్‌(50) తాంసి మండలం పోన్నారి గ్రామ సమీపంలోని హనుమాన్‌ ఆలయంలో గత మూడేళ్లుగా అర్చకుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం 5గంటలకు నిపాని గ్రామం నుంచి పోన్నారి గ్రామ హ నుమాన్‌ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు యాక్టివా స్కూటీపై వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి వచ్చాడు. ఇంట్లో భోజనం చేసి తిరిగి ఆలయానికి వెళ్లిన సుదర్శన్‌ రాత్రి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు రాత్రి 9.30గంటలకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆలయంలో పడుకున్నాడని భావించారు.

ఉదయం ఆలయ నిర్వాహకులు సుదర్శన్‌ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇంకా పూజకు రాలేదని తెలిపారు. రాత్రి ఇంటికి రాలేదని, ఆలయంలోనే పడుకున్నాడని అనుకుంటున్నామని వా రు చెప్పారు. అయితే సుదర్శన్‌ రాత్రి పూజలు ము గిసిన తర్వాత 9.15గంటలకే ఇంటికి బయలుదేరినట్లు చెప్పారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బంధువులకు ఫోన్‌ చేయగా, ఎక్కడికీ రాలేదని సమాధానం వచ్చింది. దీంతో బుధవారం మధ్యాహ్నం దారివెంట వెతకడం ప్రారంభించారు. 12 గంటల సమయంలో తాంసి మండంలం కప్పర్ల గ్రామ సమీపంలోని ఓ పొలంలో తుమ్మ చెట్టుకింద మృతదేహం ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లి సుదర్శన్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్‌ సీఐ స్వామి, తాంసి ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమీపంలో మూడుజతల చెప్పులు, లుంగీ గుర్తించారు. మృతదేహంపై కాలుకు, తలకు దెబ్బ లు తగిలి ఉన్నాయి. ఆలయం నుంచి నిపాని  తిరిగి వస్తుండగా కొట్టిచంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఉన్న చెప్పుల జతలు, లుంగి, మత్తడి కాలువలో పడేసిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అల్లుడిపైనే అనుమానం...
సుదర్శన్‌ను కుమారుడు విష్ణు, కూతురు అంజలి ఇద్దరు సంతానం. అంజలిని రెండేళ్ల క్రితం ఆదిలాబాద్‌ని సోనర్‌గల్లికి చెందిన కృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అత్తారింట్లో కుమార్తెను సరిగా చూడకపోవడంతో ఆమెను సుదర్శన్‌ ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో ఐదు నెలల క్రితం అల్లుడు కృష్ణ, అతడి తమ్ముడు, మరో ఐదుగురిని వెంట పెట్టుకొని వచ్చి మామ సుదర్శన్, అత్త వెంకటమ్మ, బావమరిది విష్ణుతో పాటు ఇంట్లో వారందరిపై దాడి చేశారు. అల్లుడు గతంలో పలుమార్లు తమను చంపుతానని బెదరించాడని, ఈ విషయమై భీంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని వెంకటమ్మ తెలిపింది. తన భర్తను అల్లుడు కృష్ణ, అతడి సంబంధీకులే చంపి ఉంటారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ స్వామి, ఎస్సై రాజు తెలిపారు.  

పరామర్శించిన ఎమ్మెల్యే
బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు సంఘటన స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. సుదర్శన్‌ కుటుంబసభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. హనుమాన్‌ ఆలయానికి రెండుసార్లు వెళ్లగా సుదర్శన్‌ పూజలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తే.. ఈ హత్య బాధాకమరమని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలైన నిపాని, కప్పర్ల, జామిడి, బండల్‌నాగపూర్, తాంసి, పోన్నారి ప్రజలు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు