కట్నం కోసం వేధించిన భర్తకు ఏడాది జైలు

28 Feb, 2018 09:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బోధన్‌ టౌన్‌: భార్యను అదనపు కట్నం కోసం వేధించిన కేసులో సాక్షధారాలు రుజువు కావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం జూనియర్‌ సివిల్‌ జడ్జి ఈశ్వరయ్య తీర్పు వెల్లడించారు.  పీపీ కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శక్కర్‌నగర్‌ చౌరస్తాకు చెందిన ప్రభుత్వ టీచర్‌ మదనగిరి వరలక్ష్మి వరంగల్‌ జిల్లా జనగామ మండలం పతమల్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌గౌడ్‌తో 4–5–2007లో వివాహమైందని, పెళ్ళి సమయంలో రెండున్నర లక్షలు, రెండుతులాల బంగారం, ఒక ప్యాషణ్‌ ప్రో బైకు, రూ.లక్ష విలువ చేసే ఇంటి సామగ్రి ఇచ్చారని తెలిపారు.

కొన్ని రోజులు పాటు బాగానే ఉన్నారని అదనంగా కట్నం ఇవ్వాలని భర్త, అత్త, మరిది, మరిది భార్య, బావ, బావ భార్య వేధించారని, కొన్ని రోజులు బోధన్‌లో నివాసం ఉన్నారన్నారు. అయినా వేధింపులు తగ్గక పోవడంతో వరలక్ష్మి 17–7–2012న బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 498ఏ, 3అండ్‌4, డీసీఆర్‌ కేసునమోదు చేశారు. సాక్షధారాలు రుజువు కావడంతో భర్తకు యేడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమాన, జరిమాన కట్టకుంటే 2 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారని తెలిపారు

మరిన్ని వార్తలు