ప్రేమించాలంటూ వేధింపులు..

11 Feb, 2020 07:56 IST|Sakshi
నిందితుడు ఇంతియాజ్‌

ఆటోడ్రైవర్‌ రిమాండ్‌

ఘట్‌కేసర్‌: తనను ప్రేమించాలని వేధించిన యువకుడిని ఘట్‌కేసర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దపల్లి సాగర్‌ రోడ్డుకు చెందిన ఎండీ ఇంతియాజ్‌ నగరంలోని తార్నాకలో నివాసం ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న పెద్దపల్లికి చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించాలని ఏడాదిగా వేధిస్తున్నాడు. వేధింపుల విషయమై అతడిపై పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. విద్యాభ్యాసం కోసం ఈ నెల 8న మండలంలోని చౌదరిగూడలోని కాలేజీకి రోడ్డుపై వెళ్తుండగా నిందితుడు బైక్‌పై వచ్చి తార్నాకలోని అతడి స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. తనను ప్రేమించని పక్షంలో అంతు చూస్తానని బెదిరించాడు. ఆమె గట్టిగా అరవడంతో తిరిగి ఆమెను కాలేజీ సమీపంలో వదిలివెళ్లాడు. ఈ విషయమై నిందితుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధిని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

మరిన్ని వార్తలు