దారుణం; పార్టీకి రాలేదని నానమ్మను..

22 Apr, 2019 18:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌ : హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు పుట్టాడన్న ఆనందంలో చేసుకుంటున్న పార్టీకి రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి...తన నానమ్మను హతమార్చాడు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ఫతేబాద్‌ పట్టణానికి చెందిన రామ్‌దేవి(70), రామ్‌ అవతార్‌ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో కొడుకులకు దూరంగా ఉంటున్న వృద్ధ దంపతులు అదే ప్రాంతంలో వేరే కాలనీలో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో వారి మనుమడు విక్కీ తనకు కొడుకు పుట్టాడని.. ఇప్పుడైనా తమ ఇంటికి రావాలని ఆహ్వానించాడు. పార్టీకి వచ్చి తమను ఆశీర్వదించాలని కోరాడు. కానీ రామ్‌దేవి మాత్రం అక్కడికి వెళ్లలేకపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన విక్కీ..రామ్‌దేవి ఇంటికి వచ్చి ఐరన్‌ రాడ్డుతో ఆమె తల పగులగొట్టాడు. అనంతరం ఆస్పత్రికి తరలిచంగా రామ్‌దేవి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో రామ్‌ అవతార్‌ తన మనుమడు, కోడలు, కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విక్కీ, అతడి తల్లిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి తండ్రి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత

ఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపారు..

పెళ్లి దుస్తులు కొనడానికి వెళ్తుండగా..

పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్‌..?

‘డర్టీ మార్టినీ’పై మూడు కేసులు

కొడుకుని చంపి.. తానూ బలవన్మరణం

రామేశ్వరం ఆలయంలో దొంగల బీభత్సం

భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో అత్తను చంపిన అల్లుడు

పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

రాధాపూర్ణిమది హత్యే

తల్లి ప్రియుడిని చంపిన యువకుడు

ఇద్దరు దొంగలు..రెండు కేసులు!

వారిద్దరూ అమ్మాయిలే.. నేనుండలేనంటూ

పెట్టుబడి రెండింతలు పేరిట మోసం

భర్త సరిగా చూసుకోవడం లేదని.. నెలరోజుల క్రితమే పెళ్లి

పట్టపగలు.. నడిరోడ్డు మీద

‘నా భార్య ఉరి వేసుకుంది, రండి చూద్దాం'

లారీ దొంగలూన్నారు జాగ్రతా..!

నర్సింగ్‌ యువతిపై ఆత్యాచారం కన్నడ నటుడిపై కేసు

పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

సిటీలో విస్ఫోటనం

రైలు పట్టాలపై బైక్‌ ఆపిన యువకుడు

కుమార్తెను హతమార్చి ప్రియుడితో కలిసి

పెళ్లికి వెళ్లి అనంత లోకాలకు.. 

నోటీసులివ్వగానే పరార్‌

దారుణం : తల, మొండెం వేరు చేసి..

నా చావుకు వాళ్లే కారణం.. సెల్ఫీ సూసైడ్‌!

కట్టెల కోసం తీసుకెళ్లి హత్య

టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు

గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ