క్రీడాకారిణిపై కోచ్‌ అఘాయిత్యం

25 Jul, 2018 17:31 IST|Sakshi
పోలీసులకు ఫిర్యాదు చేసి బయటకు వస్తున్న క్రీడాకారిణి

చండీగఢ్‌ : తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణి ఫిర్యాదు చేయడం హరియాణాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని రివారీ గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలిక వాలీబాల్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమెపై కన్నేసిన  కోచ్ గౌరవ్ దేశ్వాల్ గత రెండున్నరేళ్లుగా అనేక సార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉన్నారు. తన భవిష్యత్తు దృష్ట్యాలో ఉంచుకొని ఆ బాలిక ఇన్ని రోజులు వేధింపులను భరించారు..

అయితే ఇటీవలే కోచ్‌ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో  క్రీడాకారిణీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్గావ్, రోహతక్‌తో పాటు పలు ప్రాంతాలకు తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.  గౌరవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు. దీనిపై వివరణ కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత కోచ్‌ను అరెస్ట్ చేస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు