హవాలా రాకెట్‌ గుట్టు రట్టు

11 Apr, 2019 06:54 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుతో నిందితులు

రూ.70.63 లక్షలు స్వాధీనం  

టాస్క్‌ఫోర్స్‌ అదుపులో ముగ్గురు

సాక్షి, సిటీబ్యూరో: హవాలా రాకెట్‌ గురించి సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.70.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు కథనం ప్రకారం... ఏపీలోని గుడివాడకు చెందిన కె.నరేష్‌ కూకట్‌పల్లిలో ఉంటూ డెయిరీ వ్యాపారం చేస్తున్నారు. నగరంలోని హబ్సిగూడ, యాకత్‌పురాలకు చెందిన ఖాసిం మహ్మద్‌ రజా, హైదర్‌ రజాలు బేగంపేటలోని ఏజీఎస్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థలో మేనేజర్, ఆఫీస్‌బాయ్‌గా పని చేస్తున్నారు.

వ్యాపారి అయిన నరేష్‌కు ఏజీఎస్‌ సంస్థ యజమాని మూర్తి స్నేహితుడు. నరేష్‌ సమీప బంధువైన విజయ శంకర్‌ నగరానికి చెందిన కీర్తి అనే వ్యక్తికి రూ.70.63 లక్షలు పంపాలని భావించాడు. ఈ మొత్తాన్ని నరేష్‌ సూచనల మేరకు విజయ శంకర్‌ ఏజీఎస్‌ సెక్యూరిటీస్‌ సంస్థ ఖాతాకు పంపారు. డబ్బు డ్రా చేసిన ఆ సంస్థకు చెందిన ఖాసిం, హైదర్‌లు ఆ మొత్తం డ్రా చేసి తీసుకొచ్చి నరేష్‌కు ఇవ్వడానికి ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం మాలకుంట వద్ద మాటువేసి ముగ్గురిని పట్టుకుంది. వీరి నుంచి నగదుతో పాటు వాహనాలు స్వాధీనం చేసు కుంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును బేగంబజార్‌ ఠాణాకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు