గడ్డివాములు తగలబెట్టి ప్రేమలేఖలు పెడుతున్న సైకో..

10 Aug, 2018 13:57 IST|Sakshi
 బూర్గుపల్లిలో దగ్ధమవుతున్న గడ్డికుప్ప  

మండలంలో ఇప్పటికే మూడు గ్రామాల్లో ఘటనలు..

ఆందోళన చెందుతున్న రైతులు

బోయినపల్లి(చొప్పదండి) : మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల గడ్డికుప్పలను గుర్తుతెలియని సైకో దగ్ధం చేస్తున్నాడు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి బూర్గుపల్లి గ్రామానికి చెందిన కొలుపుల రాజయ్యకు చెందిన రూ.35 వేల విలువైన గడ్డికుప్పలు దగ్ధం చేశాడు. కొద్ది రోజుల క్రితం బోయినపల్లికి చెందిన నర్సయ్య, కోరెం గ్రామానికి చెందిన ఓ రైతు గడ్డికుప్పలు దగ్ధం చేశాడు. 

లేఖ రాసి వదులుతున్న వైనం.. 

గడ్డికుప్పలు దగ్ధం చేస్తున్న వ్యక్తి ఓ లెటర్‌ రాసి, కాల్చిన ప్రదేశాల్లో కర్రకు ఉంచుతున్నాడని బాధితులు చెబుతున్నారు. లెటర్‌లో ప్రేమ సంబంధిత వ్యవహారాలు, కొందరి ఫోన్‌ నంబర్లు రాస్తున్నాడు. ఈ నెల 13న ఎంఆర్వో కార్యాలయానికి గడ్డికుప్పల బాధితులు వస్తే.. సమాధానం చెపుతానని లేఖలో రాశాడు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు