హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లోనే పేకాట శిబిరం

9 Jul, 2019 08:33 IST|Sakshi

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

సాక్షి, కృష్ణలంక (విజయవాడ తూర్పు) : జూదాన్ని అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే తన ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహిస్తూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపురం పీఎస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ శివప్రసాద్‌ కృష్ణలంక రాణిగారితోట సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులో నివాసముంటున్నాడు. ఇతను కొంతకాలంగా తన ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు.

 చుట్టుపక్కల వారు అందించిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై అర్జున్, కృష్ణలంక పీఎస్‌ ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో దాడిచేసి పేకాడుతున్న నిర్వాహకుడితో పాటు సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మధిర శ్రీనివాసరావు, రిటైర్ట్‌ కానిస్టేబుల్‌ సాయివరప్రసాద్, లంకా రాజశేఖర్, ఏడుకొండలు, వల్లూరు రామారావు, వీర వెంకట సుబ్రమణ్యంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.29,100తో పాటు సెల్‌ఫోన్‌లను సీజ్‌ చేసి అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు