హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

24 Mar, 2018 03:09 IST|Sakshi

సూర్యాపేట పట్టణంలో ఘటన  

సూర్యాపేట క్రైం: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఓ హెడ్‌కానిస్టేబుల్‌ అందరూ చూస్తుండగానే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ప్రకారం.. పట్టణానికి చెందిన దామోదర్‌రెడ్డి స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు విక్రమ్‌రెడ్డి భార్య సంధ్య కొంతకాలంగా తనను అత్తింటి వారు వేధిస్తున్నారని సూర్యాపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దామోదర్‌రెడ్డి, అతని భార్య, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 14న   స్టేషన్‌కు పిలిచారు.  

ఈ సందర్భంగా ఎస్‌ఐ వారిపై చేయి చేసుకున్నట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగానే దామోదర్‌రెడ్డి శుక్రవా రం మధ్యాహ్నం  పురుగు మందు తాగడంతో తోటి సిబ్బంది వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అంతకుముందు ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ జాదవ్‌ ఆస్పత్రిలో దామోదర్‌రెడ్డిని పరామర్శించారు. కాగా, దామోదర్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయంలో జేబులోని సూసైడ్‌నోట్‌ను మాయం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా