హిజ్రా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

5 Dec, 2018 13:09 IST|Sakshi
నజ్రియా

టీ.నగర్‌: హైకోర్టులో పోరాడి ఉద్యోగం సాధించిన హిజ్రా పోలీసు కానిస్టేబుల్‌ అధికారుల వేధింపులు భరించలేక సోమవారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉన్నతాధికారులు తనను వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి ఎలుకల మందు తాగిన వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. వివరాలు.. రామనాథపురం జిల్లా, పరమకుడి వసంతపురానికి చెందిన నజ్రియా (22) హిజ్రా. ఈమె నాలుగు నెలల క్రితం పోలీసు ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని రామనాథపురం సాయుధ దళంలో పోలీసుగా చేరారు. విధుల్లో చేరినప్పటి నుంచి ఉన్నతాధికారులు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా ఆమె విధులకు హాజరుకావడం లేదు.

ఇదిలాఉండగా ఆమె మళ్లీ విధులకు సోమవారం హాజరుకాగా ఉన్నతా«ధికారులు వేధించినట్లు తెలిసింది. దీంతో సోమవారం రాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. సహ పోలీసులు ఆమె ను వెంటనే రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రి లో చేర్చారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు నజ్రి యా తీసిన వీడియోలో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. సాయుధ దళంలోని సీని యర్‌ రైటర్‌ పార్థిపన్, ఎస్‌ఎస్‌ఐ జయశీలన్, ఇన్‌స్పెక్టర్‌ ముత్తురామలింగం తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు అందులో పేర్కొంది. ఇదిలాఉండగా హిజ్రా నజ్రియా హైకోర్టులో పోరాటం సాగించి పోలీసు ఉద్యోగంలో చేరింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆమెకు ప్రత్యేకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి పోలీసుగా ఎంపిక చేశారు. 

మరిన్ని వార్తలు