హిజ్రా దారుణ హత్య

17 Feb, 2019 11:28 IST|Sakshi
హత్యకు గురైన రాజాత్తి (ఫైల్‌)

తమిళనాడు ,అన్నానగర్‌: తూత్తుకుడిలో శుక్రవారం ఓ హిజ్రా దారుణహత్యకు గురైం ది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయ పూ జారి సహా ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాలు.. తూత్తుకుడి ఎస్‌ఎస్‌ మాణిక్యపురానికి చెందిన ఆంథోని పిళ్లై. ఇతని కుమారుడు రాజామాన్‌సింగ్‌ అనే రాజాత్తి (38). హిజ్రా అయిన ఈమె తాళముత్తునగర్‌ సునామి కాలనీ ప్రాంతంలో ఉంటోది. తూత్తుకుడి తాళముత్తునగర్‌ సమీపం మురుగన్‌ థియేటర్‌ ప్రాంతంలో ఉన్న సమయపురత్తు మారియమ్మన్‌ ఆలయంలో పూజారిగా ఉంటూ వచ్చింది. ఈ ఆలయంలో ఇంతకు ముందు భూపాల్‌ రాయర్‌పురానికి చెందిన పాండి కుమారుడు మరుదు (26) పూజారిగా ఉన్నాడు. రాజాత్తి పూజారిగా వచ్చినప్పటి నుంచి మరుదుకి ఆమెకు గొడవలు జరుగుతూ ఉన్నాయి.

ఆలయంలో త్వరలో కొడై ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కానులకు వసూలు చేసే పనిలో రాజాత్తి నిమగ్నురాలైంది. శుక్రవారం సాయంత్రం ఆలయం ముందు రాజాత్తి నిల్చుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మరుదు అతని స్నేహితుడితో కలసి రాజాత్తితో గొడవ పడ్డాడు. ఆవేశం చెందిన మరుదు కత్తితో రాజాత్తిని విచ్చలవిడిగా నరికి, హఠాత్తుగా ఆమె తలని తెగించారు. తరువాత తలని త్రేస్‌పురం సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఓ ఆలయం ముందు పెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న తూత్తుకుడి జాయింట్‌ పోలీసు సూపరిటెండెంట్‌ ప్రకాష్, సహాయ పోలీసు సూపరింటెండెంట్‌ ఆల్భర్ట్‌జాన్, ఇన్‌స్పెక్టర్లు పార్తీబన్, తంగకృష్ణన్,సబ్‌ ఇన్‌స్పెక్టర్లు రాజామణి, జ్ఞానరాజ్, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు