వ్యభిచార గృహాలపై దాడులు

7 Aug, 2018 13:13 IST|Sakshi

ధర్మపురి/జగిత్యాలక్రైం: ర్మపురి పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి సీఐ లక్ష్మిబాబు ఆధ్వర్యంలో వ్యభిచార గృ హాలపై దాడులు నిర్వహించారు. ముగ్గురు నిర్వాహకులు, ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ లక్ష్మిబాబు వివరాల ప్రకారం.. చిన్నారులను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి ధర్మపురిలోని జాతీయ రహదారి పక్కనున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అమాయకపు యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న ఓ నిర్వాహకుడిని,  అందుకు సహకరిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం ముగ్గురిని రిమాండ్‌ చేశారు. వ్యభిచార గృహం నుంచి ఓ యువతికి విముక్తి కల్పించి కరీంనగర్‌లోని ప్రభు త్వ వసతిగృహానికి తరలించారు. ‘ధర్మపురిలోని వేశ్య గృహాలకు మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లా నుంచి విటులు నిత్యం వస్తున్నారు. ఇక్కడ వ్యభిచారం జోరుగా సాగుతోంది. కొంత మంది వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని దందాను సాగిస్తున్నారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో చాలా వరకు యువతులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ విషయమై కఠిన చర్యలు తప్పవు’ అని సీఐ లక్ష్మిబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా జగిత్యాలలోని గాంధీనగర్‌లో సైతం పోలీసులు దాడులు నిర్వ హించారు. అయితే ముందస్తు సమాచారంతో నిర్వాహకులు యువతులను వేరే చోటికి తరలిం చారని, తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు.
 

ఐదు నెలలుగా చిత్రహింసలు 
‘నన్ను బలవంతంగా ఈ కూపంలోకి దింపారు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. అమ్మానాన్న చనిపోయారు. ఒంటరిగా ఉంటున్నానని తెలుసుకున్న కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ పరిచయం పెంచుకుంది. ఇంట్లో విందు ఉందని తీసుకెళ్లింది. అక్కడి నుంచి ధర్మపురి తరలించింది. ఐదు నెలల నుంచి ఇక్కడ చిత్రవదలు పెట్టిండ్రు. నాలాంటోళ్లు చాలా మంది ఉన్నారు. పోలీసుల చొరవతో ఈ నరకం నుంచి విముక్తి కలిగింది’ అంటూ ధర్మపురి వ్యభిచార గృహం నుంచి బయటపడిన యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది.

మరిన్ని వార్తలు