డమ్మీ గన్‌తో బెదిరించిన నటి.. కాల్చేసిన పోలీసులు!

1 Sep, 2018 12:41 IST|Sakshi

ఒక్కోసారి మనం చేసిన పనులే మన ప్రాణాలపైకి తెస్తుంది. పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఓ హాలీవుడ్‌ నటి. ఎదురుగా ఉన్న నటి చేతిలో ఉన్న బొమ్మ తుపాకి చూసి నిజమైనది పోలీసులు అనుకున్నారు. అంతలో పోలీసులవైపు గన్‌ చూపించడంతో బెదిరిపోయిన ఓ ఆఫీసర్‌ ఆమెను కాల్చిచంపాడు. సినిమా సీన్‌ను తలపించిన ఈ ఘటన అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో చోటుచేసుకుంది. ఎన్నో హాలీవుడ్‌ సీరియల్స్‌, షోలతో ఆకట్టుకున్న నటి వెనిస్సా మార్క్వెజ్‌పై గురువారం పోలీసుల కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగిన తీరుపట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

46 ఏళ్ల వెన్నిస్సా మార్క్వెజ్‌ను స్థానిక పోలీసులు కాల్చి చంపిన తర్వాత ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పోలీసులు నటి ఇంటికి వెళ్లే సరికి చేతిలో హ్యండ్‌ గన్‌తో ఉంది. మాట్లాడుతుండగానే అధికారులను టార్గెట్‌ చేయడంతో బెదిరిపోయిన ఓ అధికారి ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో వెన్నిస్సా అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించగా వెనిస్సా చేతిలో ఉంది నిజమైన తుపాకీ కాదని బొమ్మ బీబీ చేతి గన్‌గా గుర్తించాము. అయితే వెనిస్సా గన్‌తో అలా ఎందుకు ప్రవర్తించిందో తెలియట్లేదు. తను కొద్దికాలంగా మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతుందని తెలిసింది. పూర్తి వివరాల కోసం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించాం’ అని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఈ సీన్‌కు నేనేమి దర్శకుడిని కాదు
వెనిస్సా గతంలో తన సహనటుడు జార్జ్‌ క్లూనీ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. దీంతో పలువరు క్లూనీపై అనుమానం వ్యక్తం చేయడంతో ‘ఈ ఘటనకు సంబంధించి అందరూ అనుకుంటున్నది నిజం కాదు. నేను నటున్ని మాత్రమే. వెనిస్సాను నేను చంపిచానడం అసత్యం’ అంటూ క్లూనీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు