చనిపోయిన విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌ చెత్త కామెంట్లు

22 Mar, 2018 13:34 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన తమ కూతురి మృతదేహాన్ని చూసి రోధిస్తున్న తల్లిదండ్రులు (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : నోయిడాలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై ప్రిన్సిపాల్‌ బాధ్యతా రహితంగా షాకింగ్‌ కామెంట్లు చేశాడు. ఒక మహిళా టీచర్‌ విద్యార్థినిని ఎలా లైంగికంగా వేధిస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే, మరో ఉపాధ్యాయుడు తమ వద్ద 25 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి లైంగిక పరమైన ఆరోపణలు రాలేదంటూ వారిని వెనుకేసుకొచ్చాడు. దీంతో ఆ స్కూల్‌ వద్ద తీవ్ర దుమారం రేగింది. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. నోయిడాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.

స్కూలులో సోషల్‌, సైన్స్‌ టీచర్లు తమ కూతురును వేధించారని, అకారణంగా, ఉద్దేశ పూర్వకంగా ఫెయిల్‌ చేశారని, ఆ అవమానాలతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్‌ 'ఆరోపణలు చేసిన టీచర్లలో ఒకరు మహిళ ఉన్నారు.. ఒక టీచర్‌ మా వద్ద 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఒక మహిళా టీచర్‌ విద్యార్థినిపై ఎలా లైంగిక వేధింపులకు పాల్పడుతుంది. 25 ఏళ్లుగా మా వద్ద పనిచేస్తున్న టీచర్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆ అమ్మాయి సగటు విద్యార్థిని. ఏనాడు ఆమె తల్లిదండ్రులు ప్యారెంట్స్‌ మీటింగ్‌లకు వచ్చేవారు కాదు. బాగా చదవలేదు.. అయితే, మంచి డ్యాన్సర్‌. ఆమె ఇంకా ఫెయిల్‌ కాలేదు.. రెండోసారి పరీక్ష రాయాల్సి ఉంది' అంటూ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు