నరరూప రాక్షసుడికి ఇదే సరైన శిక్ష

23 Jan, 2018 09:51 IST|Sakshi

వాషింగ్టన్‌ : సంచలనం సృష్టించిన పెన్సల్వేనియా హైస్కూల్‌ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. అలెక్స్‌ హ్రిబల్‌కు 60 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కిరాతకంగా 21మంది తోటి విద్యార్థులను బలి తీసుకున్న హిబ్రల్‌(20)కు సంఘంలో తిరిగే హక్కు ఎంత మాత్రం లేదని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో పెన్సల్వేనియా కోర్టు హల్‌ విద్యార్థుల తల్లిదండ్రుల చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

హ్రిబల్‌ మానసిక స్థితి సరిగ్గా లేదని.. అతనికి జైలు శిక్ష విధిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఆ వాదనతో ఏకీభవించని జడ్జి ‘ఇలాంటి నరరూప రాక్షసుడితో సమాజానికి ఎప్పటికైనా ప్రమాదమే. తల్లిదం‍డ్రులను కూడా చంపేందుకు యత్నించాడు. అతని మానసిక స్థితి ఆధారంగానే మరణ శిక్ష విధించటం లేదు. అతనికి ఇదే సరైన శిక్ష’ అని వ్యాఖ్యానించారు. కావాలంటే శిక్ష అనుభవించే ముందు హిబ్రల్‌కు మానసిక వైద్యం అందించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. అయితే హిబ్రల్‌ మాత్రం శిక్షను అనుభవించేందుకు నేరుగా జైలుకు వెళ్లాడు. ఇక బాధితులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత హిబ్రల్‌ తల్లిదండ్రులకు లేదన్న న్యాయవాది వాదనతో జడ్జి ఏకీభవించారు.  

2004 ఏప్రిల్‌ 9న ముర్రేస్విల్లెలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో తాను చదివే స్కూల్లోనే కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్‌ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. రెండు వంట గది కత్తులతో 21 మంది విద్యార్థులను, ఒక వ్యక్తిని విచక్షణరహితంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన మరికొందరిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన హిబ్రల్‌.. తాను మరింత మందిని చంపాల్సి ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ వ్యాఖ్యల ఆధారంగానే కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది.

మరిన్ని వార్తలు