సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు

9 Aug, 2019 18:25 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలుగులో కొద్ది రోజుల క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో హీరో ఫేమస్‌ అవ్వడం కోసం రాజకీయ నాయకుడి మీద దాడి చేస్తాడు. సేమ్‌ ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ డెలివరీ బాయ్‌ రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవాలని భావించాడు. దాని కోసం ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులను బెదిరిస్తూ.. ఈ మెయిల్స్‌ పంపాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది.

వివరాలు.. ముంబైకి చెందిన అభిషేక్‌ తివారి అనే వ్యక్తి చదువు మధ్యలో మానేసి ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉద్యోగ జీవితం పట్ల నిరాశతో ఉన్న అభిషేక్‌ రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవాలని భావించాడు. అందుకోసం తొలుత ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్స్‌ పంపాడు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కాదని భావించి ఈ సారి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా పలువురు నాయకులను చంపుతానని బెదిరిస్తూ.. మెయిల్స్‌ పంపాడు. అంతేకాక ఢిల్లీలో ఉన్న ఓ జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బాంబు పెట్టి పేల్చేయబోతున్నట్లు మెయిల్‌ చేశాడు.

ఈ మెయిల్స్‌ గురించి సీఎం కార్యాలయ సిబ్బంది ఢిల్లీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రెస్‌ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితుడు ముంబై నాలసొపరా ప్రాంతంలో ఉన్నాడని తెలియడంతో ఓ బృందం అక్కడకు వెళ్లి అభిషేక్‌ తివారీని అరెస్ట్‌ చేశారు. అతడిని విచారించగా.. రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లారీ, కారు ఢీ; ఐదుగురు దుర్మరణం..!

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ

ముళ్ల పొదల్లో.. కొన ఊపిరితో..

మంచినీళ్లు తెచ్చేలోపే.. 

స్నేహితుడి భార్య కోసం హత్య..!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

మాకేదీ న్యాయం? :హాజీపూర్‌ వాసులు

ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య

వజ్రాలు కొన్నాడు... డబ్బు ఎగ్గొట్టాడు

దొంగ పనిమనుషులతో జరజాగ్రత్త..

పసి మొగ్గలను నలిపేస్తున్న కీచకులకు ఉరే సరి!

తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..

బాత్‌రూంలో ఉరివేసుకొని నవవధువు మృతి

స్టార్‌ హోటల్‌లో దిగాడు.. లక్షల్లో బిల్లు ఎగ్గొట్టాడు

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ప్రాణం బలిగొన్న జాలీ రైడ్‌

టాయిలెట్‌ సీటును నోటితో శుభ్రం చేయాలంటూ..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ

మహిళలే..చోరీల్లో ఘనులే!

అబ్రకదబ్ర..కుక్కర్‌లో బంగారం వేడి చేస్తే..!

అమెరికాలో కత్తిపోట్లు..

ఉన్మాదికి ఉరిశిక్ష

సెయిల్‌ ఛైర్మన్‌పై హత్యాయత్నం?

వరంగల్‌ శ్రీహిత హత్యకేసులో సంచలన తీర్పు 

కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!

విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్

‘పాయింట్‌’ దోపిడీ..!

ఇళ్ల మధ్యలో గుట్టుగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?