ఎంత పని చేశావు దేవుడా!

4 Aug, 2019 07:08 IST|Sakshi

సాక్షి, మెట్‌పల్లి : పాపం..విధి కరెంట్‌ షాక్‌ రూపంలో ఆ కుటుంబం పై కన్నెర్ర చేసింది. ఇంటికి పెద్ద దిక్కైనా తల్లిదండ్రులను కబలించి పిల్లలకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన అసరి గంగాధర్, లక్ష్మీ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మమత(22), మాధురి(20), కుమారుడు మధు(17)ఉన్నారు. పెద్ద కుమార్తె మమతకు కొంతకాలం క్రితమే వివాహం చేశారు.మాధురి ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా, మధు ఇంటర్‌ చదువుతున్నాడు.

గంగాధర్‌ శుక్రవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చి స్నానానికి వెళ్లాడు. ఆ తర్వాత దుస్తులను ఇంటి ఆవరణలో ఉన్న తీగపై ఆరవేస్తుండగా, ఒక్కసారి కరెంట్‌ షాక్‌ తగిలి కిందపడిపోయాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మీ వెంటనే అక్కడకు వచ్చి గంగాధర్‌ను పట్టుకోగా, ఆమెకు కూడా షాక్‌ తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.విషయం తెలుసుకున్న కుమార్తెలు, కుమారుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు.

‘ఎంత పని చేశావు దేవుడా..ఇక మాకు దిక్కెవరూ’ అంటూ మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. రెండో కుమార్తెకు వివాహం, కుమారుడి చదువు బాధ్యతలు చూడాల్సిన సమయంలో ఆ పిల్లలకు తల్లిదండ్రులు దూరమైన పరిస్థితి చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శనివారం ఉదయం గంగాధర్, లక్ష్మీ మృతదేహాలకు ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారమైన హృదయాలతో ఒకే చోట అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబాన్ని ఎంపీపీ మారు సాయిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షాపు మూసి భార్యపై హత్యాయత్నం

రీఫండ్‌ మెసేజ్‌ : రూ.1.5 లక్షలు మాయం

గోవుల మృత్యు ఘోష

టీడీపీ అనుచరగణం అరాచకం

వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

కానిస్టేబుల్‌నంటూ ప్రేమ జంటపై దాడి

మరో పెళ్లికి అడ్డువస్తున్నాడని.. హత్య చేశాడు

ఫిర్యాదుదారుడే దొంగ

మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

సోషల్‌ మీడియాలో హాజీపూర్‌ కిల్లర్‌ వార్త హల్‌చల్‌

గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

హత్యలకు దారి తీసిన వివాహేతర సంబంధాలు

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య

బంగారు ఇస్త్రీపెట్టెలు

టీకా వికటించి చిన్నారి మృతి 

ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై కత్తితో..

రాడ్‌తో చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశాడు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

ఐరన్‌ బాక్సుల్లో 9 కిలోల బంగారం

వివాహేతర సంబంధం.. వరుస హత్యలు

దూసుకొచ్చిన మృత్యువు.. 

‘మావయ్య నాపై అత్యాచారం చేశాడు’

నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌