బతికున్న భార్యకు డెత్‌సర్టిఫికెట్‌

13 Apr, 2019 10:05 IST|Sakshi

తిరువొత్తియూరు: బతికున్న భార్యకు డెత్‌ సర్టిఫికెట్‌ కోసం దాఖలు చేసిన భర్త వ్యవహారం చెన్నై కొడుంగయూరులో సంచలనం కలిగించింది. కొడుంగయూరుకు చెందిన జమీలాబీవి భర్త బాబు రైల్వే ఉద్యోగి. వీరికి మహ్మద్‌ అలీ అనే కుమారుడు ఉన్నాడు. బాబు 1992లో జమీలాబీవి నుంచి విడిపోయి తిరువళ్లూరు ఎగటూరుకు చెందిన లలితాదేవిని వివాహం చేసుకున్నాడు. గత ఏడాది బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో భార్య జమీలాబీవి రైల్యేశాఖ నుంచి రావాల్సిన ఫలాల కోసం రైల్వే అధికారులను సంప్రదించింది.

అయితే మొదటి భార్య మృతి చెందినట్లు బాబు డెత్‌ సర్టిఫికెట్‌ అందజేసి నామినీగా రెండో భార్య లలితాదేవి పేరును మార్చివున్నట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరు భార్యలు, కుమారుడు చెన్నై న్యాయవ్యవహారాల కమిషన్‌ న్యాయమూర్తి జయంతి వద్ద పిటీషన్‌ దాఖలు చేశారు. అందులో కుమారుడికి భర్త ఉద్యోగం, డెత్‌సర్టిఫికెట్‌ దాఖలు చేయడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రైల్వే అధికారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే డెత్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేయడంపై తిరువళ్లూరు జిల్లా జనన, మరణ సర్టిఫికెట్స్‌ జారీ చేసే అధికారికి నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.

మరిన్ని వార్తలు