ఆడబిడ్డేనని..దారుణం

19 Mar, 2020 13:20 IST|Sakshi

గర్భస్త్రావం మందులు ఇచ్చిన భర్త

తీవ్ర రక్తస్త్రావంతో గర్భిణి మృతి

పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లిదండ్రులు

కర్నూలు, బనగానపల్లె రూరల్‌: పుట్టేది ఆడబిడ్డేనని అనుమానించి గర్భస్త్రావం మందులు ఇవ్వడంతో, అవి వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బనగానపల్లెలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు... పట్టణంలోని కరీంబాగ్‌ కాలనీలో నివాసం ఉండే మల్లికభాను కూతురు షేక్‌ షాహినాతో ఇదే కాలనీలో నివాసం ఉంటున్న షేక్షావలి కుమారుడు షమీర్‌కు మూడు సంవత్సరాల క్రితం వివాహంమైంది. మొదటి ప్రసవంలో ఆడ పిల్ల పుట్టింది. ప్రస్తుతం షాహిన మళ్లీ గర్భిణి.

అయితే భర్త షమీర్‌  తన భార్యకు మళ్లీ ఆడ పిల్ల పుడుతుందన్న అనుమానంతో  గర్భం పోగొట్టాలని తనకు తెలిసిన ట్యాబ్‌లెట్స్‌ తినిపించేవాడు. ఈ క్రమంలో షాహినకు మంగళవారం రక్తస్రవం అధికం కావడంతో వెంటనే స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడి వైద్యులు నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక షాహిన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త షమీర్‌ ట్యాబ్‌లెట్స్‌ తినిపించడం వల్లనే షాహినా మృతి చెందిందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు