భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య

10 Jul, 2020 07:31 IST|Sakshi
శంకర్, స్రవంతి (ఫైల్‌)

మనస్పర్థలే కారణం అలస్యంగా వెలుగులోకి..

మృతుడు శంకర్‌ కంది జిల్లా

జైలులో జీవిత ఖైదీ పెరోల్‌పై బయటికి..

సంగారెడ్డి అర్బన్‌: ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో భార్యను కత్తితో హత్య చేసి తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణ పరిధిలోని నారాయణరెడ్డి కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణరెడ్డి కాలనీకి చెందిన బి.శంకర్‌ (‡38) భార్య స్రవంతి (32) ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈనెల 7న భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

8న ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఇంట్లో చూడగా అర్ధరాత్రి ఇద్దరి శవాలు కనిపించాయి. ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో వివరాలు సేకరించారు. శంకర్‌  వృత్తిరీత్యా పెయింటర్‌ 2013లో జరిగిన హత్యకేసులో 2015లో జీవితకాలం శిక్ష పడింది. జిల్లా కందిజైలులో జీవితఖైదుగా శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు పెయింటింగ్‌లోఉన్న అనుభవంతో జైలులో సైతం తన కళా నైపుణాన్ని ప్రదర్శించి పలువురిచే మన్ననలు పొందాడు. జైలులో సత్‌ప్రవర్తన కలుగడంతోజూన్‌ 26న పెరోల్‌పై 14 రోజుల సెలవుల్లో ఇంటికి వచ్చాడు. ఈనెల 11న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. పిల్లలు లేకపోవడం, ఇరువురి బార్య భర్తల మద్య మనస్పర్థలే కారణమని తెలుస్తుంది. శంకర్‌ సోదరుడు రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు